Sunday, January 19, 2025

లోయలో బోల్తాపడిన ట్యాక్సీ.. 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 killed in Taxi overturns in valley at Zojila Pass

జోజిలా: జమ్మూ కాశ్మీర్‌లోని జోజిలా పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జోజిలా పాస్ వద్ద టాక్సీ-వ్యాన్ రోడ్డుపై నుండి అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో దాదాపు తొమ్మిది మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నుండి జారిపడి లోయలో పడినట్టు జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోనామార్గ్ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్మీ, స్థానికులు వెంటనే సహాయక చర్యలందించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News