Monday, December 23, 2024

చెరువులో పడిన ట్రాక్టర్: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 Members dead in Tractor fell into lake

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడడంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన పది మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ లో 45 మంది ముందాన్ దేవాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యపాల్ గంగ్వార్ తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News