Monday, December 23, 2024

బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 Members dead in West bengal road accident

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లా మల్లర్ పూర్ లో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, బస్సు ఢీకొనడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్​పుర్హట్​ నుంచి మల్లర్​పుర్​ వెళ్తున్న ఆటో.. 60వ నంబరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆర్​టిసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళా కూలీలతో సహా ఆటో డ్రైవర్ దుర్మరణం చెందాడు.  కూలీలంతా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.  బంగాల్​లో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్​గేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఇస్తామని మోదీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News