- Advertisement -
సంగ్లీ (మహారాష్ట్ర): మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబైకి 350కిమీ దూరంలో మహాసాల్ గ్రామంలోని ఒక ఇంటిలో తొమ్మిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీటిలో మూడు మృతదేహాలు ఒకచోట, మిగతా ఆరు మృతదేహాలు వేర్వేరు చోట ఆ ఇంటిలో కనిపించాయని సంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గేడమ్ చెప్పారు. ఇది ఆత్మహత్యా అని అడగ్గా, పోలీసులు ఆ ప్రదేశంలో ఉన్నారని మరణాలకు కారణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు. పోస్ట్‌మార్టమ్ తరువాత మరణాలకు కారణం ఏమిటో తెలుస్తుందని మరో పోలీస్ అధికారి పేర్కొన్నారు. విషం సేవించడం వల్లనే వీరు చనిపోయి ఉంటారని అనుమానించారు.
9 members in Family died in Maharashtra
- Advertisement -