Monday, January 20, 2025

ఛత్తీస్‌గఢ్‌లో 9మంది నక్సల్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాలలో 9 మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. గత నెలలో పోలీసు అధికారి కారును లక్షంగా చేసుకుని ఐఇడి పేలుడు సృష్టించిన ఘటనలో పాల్గొన్న ఐదుగురు నక్సల్స్ కూడా ఇందులో ఉన్నారు.

ఫర్సేగఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మండెం-కుప్రెల్ గ్రామాల నుంచి ఐదుగురు నక్సలైట్లను అదుపులోకి తీసుకోగా మిగిలిన నలుగురిని మద్దెడ్ పోలీసు స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టయిన నక్సలైట్లు హత్య, భద్రతా దళాల అంతానికి ఐఇడి బాంబుల ఏర్పాటు, రోడ్ల ధ్వంసం, అక్రమంగా సుంకం వసూళ్లు, మావోయిస్టు పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటు వంటి హింసాకార్యకలాపాలలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News