Sunday, December 22, 2024

రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదు: రాష్ట్ర వైద్య శాఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదైతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 27 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు కోలుకున్నారు. శుక్రవారం నమోదైన కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లాల నుంచి ఉన్నారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతం ఉంది. నిలోఫర్‌లో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్దారణ కావడంతో పాపకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

కరోనా కేసుల పెరుగుతుండటంతో చిన్నారులు, వృద్దులు నిబంధనలు పాటించాలని, అత్యవసర పరిస్ధితుల్లోనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లితే ముఖానికి మాస్కు తప్పకుండా ధరించాలని, జ్వరం, దగ్గు, జలుబు, వొంటి నొప్పు, శ్వాస తీసుకోవడం సమస్యలుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News