Friday, December 20, 2024

బస్సులోంచి కిడ్నాప్ చేసి.. 9 మందిని చంపిన ఉగ్రవాదులు

- Advertisement -
- Advertisement -

కరాచి: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నోష్కి జిల్లాలోని హైవేపై కాపు కాసిన కొందరు ముష్కరులు, క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును అడ్డుకుని, అందులోని 9 మంది ప్రయానికులను కిడ్నాప్ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర ప్రయాణికులు పోలీస్‌లకు సమాచారం అందించగా పోలీస్‌లు గాలింపు చర్యలు చేపట్టారు. ఓ వంతెన సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికుల మృతదేహాలు దొరికాయి. మరో సంఘటనలో ఇదే రహదారిపై ప్రయాణిస్తున్న కారుపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.

ఈ సంఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ఈ సంఘటనలకు బాధ్యత వహించలేదు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ ఈ సంఘటనలకు స్పందించారు. ఈ దుర్ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదులను క్షమించబోమన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News