Saturday, November 23, 2024

రెబెల్ మంత్రుల శాఖలు కట్

- Advertisement -
- Advertisement -

9 Rebel ministers fired from their portfoliosమరొకరికి కేటాయించిన మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను పలువురికి అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూడదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఎంఒ కార్యాలయం ప్రకటించింది. రెబల్స్ గ్రూపు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబారావ్ పాటిల్ నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. అలాగే మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు.

మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు. శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ మంత్రిగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌తో ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలు ప్రస్తుతం ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే వద్ద ఉన్నాయి. రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News