Friday, December 27, 2024

9 ఎర్రచందనం దుంగలు పట్టివేత… ఆరుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఈచర్ లారీ సహా 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఆరు గురు స్మగ్లర్లు అరెస్టు

అమరావతి: చిత్తూరు జిల్లా భాకరాపేట సెక్షన్ చిన్నగొట్టి గల్లు మండలం పరిధిలో లారీలో లోడ్ చేస్తున్న తొమ్మిది ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక ఈచర్ లారీని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తున్న ఆరుగురు స్మగ్లర్లు ను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన మంగళవారం టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ లు కేఎస్ కె లింగాధర్, కె.సురేష్ బాబు టీమ్ సోమవారం నుంచి భాకరాపేట ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారని చెప్పారు. మంగళవారం ఉదయం తిరుపతి భాకరాపేట రోడ్డు మార్గంలో చిన్నగొట్టి గల్లు మండలం చామల రేంజిలో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను లారీ లో లోడ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ కంట పడునట్లు తెలిపారు.

దీంతో వారిని చుట్టుముట్టిన టాస్క్ ఫోర్స్ స్మగ్లర్ల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 9 ఎర్రచందనం దుంగలు, మూడు గొడ్డళ్లు, లారీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి మొత్తం విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. అరెస్టు అయిన స్మగ్లర్లు లో తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు కు చెందిన రమేష్ (28), దొరైస్వామి (35), కుమారస్వామి (30), పొన్ను స్వామి (56), ఆనందన్ (21), మది అలగన్ (20) ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును సి ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సిఐలు వెంకట్ రవి, చంద్రశేఖర్, ఆర్ ఐ (ఏ ఆర్) సురేష్ కుమార్ రెడ్డి, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్,ఎస్ ఐ మోహన్ నాయక్, ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కోలా లక్ష్మిపతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News