Wednesday, January 22, 2025

షిరిడీ రైలులో మహిళా దొంగల కలకలం..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: షిరిడీ రైలులో మహిళా దొంగల కలకలం రేపింది. రైలులోకి చొరబడి 9 మంది యువతులు దొంగ తనానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నవిపేటలో క్రాసింగ్ కోసం నిలిచి ఉన్న రైలులోకి మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన 9 మంది యువతులు చొరబడి ప్రయాణికుల బ్యాగులు, మహిళల బంగారు చైన్లు చోరీ చేశారు.

ఎస్- 1 భోగి నుంచి ఎస్- 10భోగి వరకు కిలేడీలు తిరుగుతూ ప్రయాణికుల బ్యాగులు మాయం చేశారు. బాసర వద్ద చైన్ లాగి పారిపోయేందుకు ప్రయత్నం చేసిన మహిళా దొంగలను ప్రయాణికులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. కిలేడీలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News