- Advertisement -
సిరిసిల్ల: గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లెలో చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లికి చెందిన బుర్ర కుషిత, సతీష్ దంపతులకు కుమారుడు కౌశిక్, కుమార్తె మేఘన ఉన్నారు. కౌశిక్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం కౌశిక్ తన స్నేహితులతో కలిసి కాసేపు ఆడుకున్నాడు. అనంతరం మధ్యాహ్న భోజనానికి క్యూ లైన్‌లో నిలబడి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించి వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.
- Advertisement -