Sunday, November 3, 2024

హత్యాచారానికి బలైన దళిత బాలిక

- Advertisement -
- Advertisement -

Teacher rape on girl in Rajasthan

విద్యుద్ఘాతానికి చనిపోయినట్లు సాక్ష్యాధారాల సృష్టి
తల్లికి రూ. 2.5 లక్షలు గ్రాంట్ చేసిన కోర్టు
న్యూఢిల్లీ: నీళ్లు తేడానికి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని స్మశానవాటికకు వెళ్లిన తొమ్మిదేళ్ల  దళిత బాలిక విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని సిటీ కోర్టుకు తెలిపినప్పటికీ, వాస్తవానికి ఆమె అత్యాచారం, ఊపిరాడక చనిపోయిందన్న వాస్తవం వెలుగుచూసింది.
నిందితుల్లో ఒకరిగా ఉన్న పూజారి తన వాగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించాక నిజం వెలుగుచూసింది. ఈ కేసులో నిందితులైన నలుగురు రాధేశ్యామ్, కుల్దీప్ సింగ్, లక్ష్మీనారయణ్, సలీమ్ అహ్మద్ సామూహిక హత్యాచారం, బెదిరించి నేరం చేయడం, పోస్కో చట్టంల కింద అరెస్టయ్యారు.
తగిన సాక్షాధారాలు లేకుండా ఒప్పుకునే వాంగ్మూలాలను కోర్టు స్వీకరించదు. అయితే ఈ కేసులో ఫోరెన్సిక్, అటాప్సీ రిపోర్టులు సాక్షాధారాలయ్యాయి. ఫోరెన్సిక్ రిపోర్టులో శారీరక ద్రవం, ఇతర డిఎన్‌ఎ శాంపిల్స్ ఏవీ నీళ్ల కూలర్‌పై లభించలేదని వచ్చింది. అంటే ఆ దళిత బాలిక విద్యుద్ఘాతానికి గురికాలేదని స్పష్టమైంది. బాలిక విద్యుద్ఘాతానికి గురైనట్లు ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవని అటాప్సీ రిపోర్టులో డాక్టర్లు తెలిపారు.
సాక్ష్యుల్లో ఇద్దరు ఆ బాలిక శరీరాన్ని శ్యామ్, కుల్దీప్ సింగ్ నీళ్ల కూలర్‌వైపు తీసుకెళ్లడం చూశామని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. వరాండా నుంచి పూజారి గది ముందుకు తీసుకెళ్లిన తర్వాత నిందితులు ఆమెను బలాత్కారించారని తెలిసింది. కుల్దీప్ సింగ్ ఆమె చేతులు అదిమి పట్టుకోగా, శ్యామ్ ఆమె నోరును అరచేతులతో మూసి పట్టుకున్నాడని సహనిందితులు విచారణలో వెల్లడించారు. చివరికామె ఊపిరాడక చనిపోయింది.

బాధితురాలు కుటుంబానికి తాత్కాలిక నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషనర్  దరఖాస్తు సమర్పించారు. అప్పుడు అదనపు సెషన్స్ జడ్జి అశుతోష్ కుమార్ ముందు పోలీసులు వివరాలు సమర్పించారు. కోర్టు బాధితురాలి తల్లికి రూ. 2.5 లక్షలు గ్రాంట్ ఇచ్చింది. పోలీసుల పరిశోధనలో శ్యామ్ తన మొబైల్ ఫోన్‌లో నీలి చిత్రాలు, ఫోటోలు చూడడానికి బాగా అలవాటుపడ్డాడని వెల్లడయింది. జూన్ 1 నుంచి జులై 30 వరకు అతడు దాదాపు 1300 పోర్న్ వెబ్‌సైట్లు చూశాడని కనుగొన్నారు. ఆ దళిత బాలిక బాలిక సాయంత్రం 5.30 గంటలకే దహనం చేయబడిందని నిందితుడు శ్మశానవాటిక రిజిష్టర్‌లో మార్చినప్పటికీ ఆమె సాయంత్రం 5.42 గంటలకు వరకు జీవించే ఉండడం సిసిటివి ఫుటేజ్‌లో కనిపించింది. నిందితులందరూ తమ అపరాధాన్ని కోర్టు ముందు అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News