- Advertisement -
హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ సింగరేని కాలనీ ఘటన మరువకముందే నగరంలోని పాతబస్తీ మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారయత్నం జరిగింది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తొమ్మిదేళ్ల బాలికపై సుమిత్ అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. బాధిత బాలిక అరుపులు వినిపించడంతో చుట్టుప్రక్కల వారు ఘటనాస్థలానికి చేరుకుని బాలికను కాపాడి, నిందితుడు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
9 Years old girl has attempt rape in Mangalhat
- Advertisement -