Monday, December 23, 2024

90-105 మావే

- Advertisement -
- Advertisement -

We will win 95 to 105 legislative seats in coming elections

వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం మూడు సంస్థలు 30
స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి 30లోనూ 29 స్థానాల్లో
టిఆర్‌ఎస్ గెలుస్తుందని మూడు నివేదికలూ వెల్లడించాయి 0.3%
తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్లు చెప్పాయి 119 స్థానాలకు గాను
నాలుగు కోల్పోయే సూచనలున్నాయి 25రోజుల్లో నివేదిక
బయటపెడతాం

మనతెలంగాణ/హైదరాబాద్: దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉందని, కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అది భారత ప్రజల మేలుకోరే ఫ్రంట్‌గా ఉంటుందని సిఎం తెలిపారు. అద్భుతమైన పద్ధతితో కొత్త జాతీయ పార్టీ రావచ్చు కదా రాకూడదా అని ఆయన విలేకరులను ప్రశ్నించారు. మాకు నీతి, నిజాయితీ ఉన్నాయని, అన్నీ ఓపెన్‌గా చెబుతామని ఆయన తెలిపారు. దేశంలో మార్పు కోసం జాతీయ రాజకీయాల్లో వచ్చి తాను కీలక పాత్ర పోషిస్తానని ఆయన పేర్కొన్నారు.

బిజెపియేతర రాష్ట్రాల సిఎంలతో త్వరలో సమావేశం

బిజేపియేతర రాష్ట్రాల సిఎంలతో పాటు ఆ స్థాయి ఉన్న నాయకులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దీంతోపాటు ఆల్ రిటైర్డ్ ఐఏఎస్‌లతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని ఆయన తె లిపారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ రాష్ట్రంలో చేసే పాదయాత్ర గురించి సి ఎం మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా యాత్రలను చేపట్టవచ్చన్నారు. ఇలాంటి పాదయాత్రలు చాలా పాతకాలం నాటివని అలాంటివి అవసరంతమకు లేదన్నారు.

ప్రశాంత్ కిశోర్ మంచి స్నేహితుడు..

దేశ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్‌కు అవగాహన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నానని, తన ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిశోర్ వచ్చి తెలంగాణలో పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ ఎనిమిదేళ్లుగా తనకు మంచి స్నేహితుడని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ ఎప్పుడూ డబ్బులు తీసుకొని పనులు చేయరని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దేశం పట్ల ప్రశాంత్ కిశోర్‌కు ఉన్న నిబద్ధత ఏమిటో తెలుసు అని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ డబ్బులు తీసుకుని పని చేశారని ఎవరైనా నిరూపిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పలు పార్టీల ఆహ్వానం, అవసరాల మేరకు 12 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పనిచేశారని ముఖ్యమంత్రి తెలిపారు. తమిళనాడు, పశ్చిమబంగాల్, ఎపి సహా పలు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్ పనిచేశారని ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు

వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తామని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయని ఆయన తెలిపారు. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలుస్తుందని ఈ మూడు నివేదికలు వెల్లడించాయన్నారు. 0.3 శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్లు నివేదిక వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ఈ సర్వే మేరకు 119 స్థానాలకు గాను 4 స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరో 25 రోజుల్లో దీనికి సంబంధించిన నివేదిక బహిర్గతం చేస్తామని ఆయన ప్రకటించారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాలను, 2018 ఎన్నికల్లో 83 అసెంబ్లీ సీట్లను, రానున్న ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లను గెలుచుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇడీలకు, బోడీ దాడులకు భయపడను

ఆదాయం శాఖ, ఇడి దాడులు చేస్తారని రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం సాగుతున్న వైనంపై సిఎం కెసిఆర్ స్పందించారు. దొంగలు, స్కామ్‌లు చేసే వాళ్లు భయపడాలని, తానేందుకు భయపడతానని ఆయన పేర్కొన్నారు. ఇడి కాకపోతో బోడీ దాడులు చేయమనూ అని ఎవరు వద్దంటున్నారు, ఎవడు భయపడుతారని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కెసిఆర్ భయపడే వ్యక్తి కాదన్నారు. ఇడీలకు, బోడీలకు, ఆదాయంపన్ను దాడులకు భయపడితే 15 ఏళ్లు తెలంగాణ ఉద్యమం చేసే వాడినా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి హెచ్చరికలు అన్ని చోట్ల వర్కవుట్ కావని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.

కెసిఆర్ ఒక మొండి ఘటం

తప్పు చేయనప్పుడు కేంద్రం ఎలాంటి దాడులు చేసినా తాము భయపడే ప్రసక్తే లేదని కెసిఆర్ పేర్కొన్నారు. కేంద్రం ఎన్నివిధాలుగా యత్నించినా కెసిఆర్ ఒక మొండి ఘటమన్నారు. వారి తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరూ భయపడరన్నారు. పిట్ట బెదిరింపులకు, ఇడి, బోడీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కెసిఆర్ స్పష్టం చేశారు.

ఢిల్లీలో ఉద్యమం చేస్తాం

రాజకీయంగా తాము బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని తీర్మానం చేశామన్నారు. బిజెపి చెప్పిన ఒక్క వాగ్దానం ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవసరం అయితే కేబినెట్ అంతా కలిసి ఢిల్లీలో కలిసి ఉద్యమం చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఇండియా గేట్ దగ్గర వడ్లు పోస్తామని ఆయన హెచ్చరించారు. దేశంలోని రైతు సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తమ పోరాటం ధాన్యంతోనే ఆగదని,- అన్ని రంగాలపై చేస్తామన్నారు. ప్రజల విద్వేషాలను రాజకీయంగా సొమ్ముచేసుకునే కుట్ర బిజెపి చేస్తోందన్నారు. బిజెపి ప్రభుత్వానికి ఫ్యాకప్ చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు.

చినజీయర్‌తో ఎలాంటి విభేదాలు లేవు

చినజీయర్‌స్వామితో తనకు ఎలాంటి విభేదాలు లేవని సిఎం కెసిఆర్ తెలిపారు. చినజీయర్‌స్వామితో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని సిఎం విజ్ఞప్తి చేశారు. అన్ని సబ్జెక్టుల బోధనకు మరో 10 వేల సిబ్బందిఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తామని సిఎం స్పష్టం చేశారు. కచ్చితంగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కెసిఆర్ మరోమారు స్పష్టం చేశారు. కొందరు పాఠశాలలు మూస్తారని అపోహలు సృష్టిస్తున్నారని, రాష్ట్రంలో పాఠశాలలు మూసివేయట్లేదని ఆయన వెల్లడించారు. పాఠశాలలో అవసరం మేరకు సిబ్బంది ఉండాలన్న సిఎం అన్ని సబ్జెక్టుల బోధనకు మరో 10 వేల సిబ్బందినైనా నియమిస్తామని కెసిఆర్ హామినిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News