- Advertisement -
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ కేసుల్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోవడం, వాళ్లకు చికిత్సలు అందించాల్సిన అవసరం లేకపోవడం ఊరటనిచ్చే అంశమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలోని కొందరిలో లక్షణాలు కనిపించినా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉన్నట్టు, త్వరగా కోలుకొన్ని డిశ్చార్చి అవుతున్నారని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు ఎవరి లోనూ కనబడడం లేదని చెప్పారు. ఇప్పటివరకు భారత్‌లో 415 కేసులు నమోదు కాగా, 115 మంది కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.
- Advertisement -