Monday, December 23, 2024

90 శాతం మందిలో లక్షణాలు లేవు: డిహెచ్

- Advertisement -
- Advertisement -

90% of people have no symptoms of corona

 

హైదరాబాద్: కరోనా పాజిటివ్ వస్తే వైద్యులు ఇచ్చిన మందులు తీసుకోవాలని డిహెచ్ శ్రీనివాసు రావు తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్ మీడియాతో మాట్లాడారు. స్వల్ప లక్షణాలు ఉంటే ఏడు రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. ఒమిక్రాన్‌లో తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేవన్నారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని హెచ్చరించారు. అవసరమైతే తప్ప ఆస్పత్రుల్లో చెరొద్దని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. బుధవారం తెలంగాణలో 1600లుకు పైగా కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే 979 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించారు. తాజా వేరియంట్‌తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోవడం ఊరట కలిగించే అంశామన్నారు. కరోనా సోకిన వారు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని డిహెచ్ తెలియజేశారు.

దేశంలో ఒక్క వారంలోనే 400 శాతం కేసులు పెరిగాయని, 15 రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరగాయని చెప్పారు. తెలంగాణలో ఒకటి నుంచి కేసులు పెరుగుతున్నాయన్నారు. కరోనా లక్షణాలు కనిపించని వాళ్లు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని డిహెచ్ ప్రశంసించారు. ప్రజలు సొంతం వైద్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇప్పుడు వస్తున్న కేసుల్లో 90 శాతం మందిలో లక్షణాలు లేవని, పది శాతం మందికి మాత్రమే స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కరోనా పరీక్షల కోసం రెండు కోట్ల కిట్లు సిద్ధం చేశామని వెల్లడించారు. ఇంట్లో కూడా టెస్టులు చేసుకునేందుకు కిట్స్ ఉన్నాయని, ఉత్సవాలు, పండుగలు సందర్భంగా గుమికూడవద్దన్నారు. జనవరి చివర వారంలో కరోనా కేసులు పీక్‌కు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి మిడిల్ వరకు డౌన్ పాల్ ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు కార్యకలాపాలు రద్దు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు అందరూ తప్పకుండా పాటించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News