Monday, December 23, 2024

హరితహారం కింద సోమవారంలోగా 90 శాతం లక్ష్యాన్ని సాధించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్

నారాయణపేట ప్రతినిధి: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని వచ్చే సోమవారం నాటికి 90 శాతం పూర్తి చేయాలని, ముఖ్యంగా సంపదవనాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్ డి. ఆర్‌డిఓ, ఇరిగేషన్ అధికారులు ఈ అంశంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.

శుక్రవారం ఆయన వివిధ అంశాలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తెలంగాణకు హరితహారం కింద 40 లక్షల మొక్కలకు ఇప్పటి వరకు 35 లక్షలు పూర్తి చేసినట్లు స్థానిక సంస్థల అదనపు ఇంచార్జీ కలెక్టర్ డిఆర్‌డిఓ యాదయ్య, జిల్లా కలెక్టర్‌కు వివరించారు. సంపదవనాలతో పాటు, హరితహారం కింద 90 శాతం లక్ష్యాలను సోమవారం ఆటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

గృహలక్ష్మీ పథకం కింద లబ్దిదారులకు ఇచ్చేందుకు ముందుగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అన్నారు. దళితబంధు కార్యక్రం కింద లబ్దిదారుల వివరాలను సేకరించి సిద్దంగా ఉంచుకోవాలని అన్నారు. ఎరువులు, విత్తనాలపై వ్యవసాయ అధికారులు దృష్టి కేంద్రీకరించాల్సిందిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. వైకుంఠధామాలకు విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి సౌకర్యం కల్పనలో భాగంగా పనులు త్వరగా పూర్తి చేసేందుకు రెండు మండలాలను ఒక ఏజెన్సీకి అప్పగించాల్సిందిగా కలెక్టర్ సూచించారు.

59 జీఓ కింద మూడు రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు సంపదవనాలతో పాటు, బండ్ కేనాల్స్‌పై మొక్కలు నాటడంపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు, స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్, డిఆర్డీఓ యాదయ్య, సంబంధిత శాఖ అధికారులు వారి శాఖలకు సంబంధించి పనుల పురోగతిపై కలెక్టర్‌కు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News