Friday, February 28, 2025

90 శాతం భారతీయులకు విచక్షణాధికార వ్యయ శక్తి లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో టాప్ పది శాతం మంది 1990లో జాతీయాదాయంలో 34 శాతాన్ని నియంత్రించారు. ఆ సంఖ్య 2025 నాటికి ఆ సంఖ్య 57.7 శాతానికి పెరిగింది. దేశ జనాభాలో 90 శాతం అంటే సుమారు వంద కోట్ల మంది భారతీయులకు సరకుల కొనుగోలుకు లేదా సేవలకు విచక్షణాధికార వ్యయ శక్తి లేదని వెంచ్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అధ్యయనాన్ని ఉటంకిటస్తూ మీడియా వార్తలు వెల్లడించాయి. బ్లూమ్ వెంచర్స్ రూపొందించిన ‘ఇండస్ వ్యాలీ వార్షిక నివేదిక 2025’లో ప్రధానంగా ప్రస్తావించినట్లుగా భారత జనాభాలో టాప్ 10 శాతం వినియోగం, ఆర్థిక వృద్ధి పరంగా ప్రాథమిక కారకులుగా కొనసాగుతున్నారు. వారు మెక్సికో మొత్తం జనాభా సుమారు 1314 కోట్లకు సమానం.

ఆ నివేదికకు సంబంధించిన బిబిసి విశ్లేషణ ప్రకారం, ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌లోని ఆ ‘వినియోగ వర్గం’ పరిమాణంలో విస్తరించడం లేదు గానీ మరింత సంపన్నులుగా మారుతున్నారు. అంటే ధనవంతులు మరింతగా ధనవంతులు అవుతున్నారన్న మాట. మొత్తంగా ధనికుల సంఖ్య స్తంభన స్థితిలో కొనసాగుతోంది. అదనంగా మరి 30 కోట్ల మంది వ్యక్తులను ‘వర్ధమాన’ లేదా ‘ఆకాంక్షపూరిత’ వినియోగదారులుగా వర్గీకరించారు. ఆ వ్యక్తులు ఇటీవల మరింతగా ఖర్చు చేస్తున్నారు కానీ తమ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు.

తాజా వినియోగ క్షీణత తీవ్రతరమైందని, అందుకు కొనుగోలు శక్తి పతనం మాత్రమే కాకుండా ఆర్థిక పొదుపు మొత్తాలు బాగా తగ్గడం, భారీ స్థాయిలో రుణభారం పెరుగుదల కూడా దోహదం చేశాయని ఆ నివేదిక పేర్కొన్నది. ఆ వినియోగ ధోరణులు భారత మార్కెట్ వ్యూహాన్ని తీర్చిదిద్దాయి. సామూహిత మార్కెట్ ఉత్పత్తులపై కాకుండా ‘అధిక ధరల ఉత్పత్తుల’పై బ్రాండ్‌లు అంతకంతకు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. స్థిరాస్తి రంగంలో మార్పును కూడా నివేదిక ఎత్తిచూపింది. ఆ రంగంలో అందుబాటు ధరల్లో గృహాల నిర్మాణం మార్కెట్‌లో కేవలం 18 శాతంగా ఉంటున్నది. ఐదు సంవత్సరాల క్రితం అది 40 శాతంగా ఉండేది.

ఇది ఇలా ఉండగా, ఈమధ్య కాలంలో కోల్డ్‌ప్లే, ఎడ్ షీరన్ నిర్వహించిన భారీ స్థాయి, టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోయిన గాన కచేరీలను భారత్‌లో వృద్ధి చెందుతున్న ‘అనుభవ ఆర్థిక వ్యవస్థ’కు తార్కాణంగా సూచిస్తున్నారు. ఈ నెలారంభంలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి వారి ఖర్చు శక్తిని పెంచేందుకు రూ. 12 లక్షల వరకు ఆర్జించే వ్యక్తులకు ఆదాయాపు పన్ను రాయితీని ప్రకటించారు. ఆ రిబేటు పన్ను చెల్లింపు పరిధిలో నుంచి సుమారు 92 శాతం మంది వేతన జీవులను మినహాయించినట్లయింది.

ఒక ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం, 1990లో భారత్‌లోని టాప్ 10 శాతం మంది 34 శాతం జాతీయ ఆదాయాన్ని నియంత్రించారు. ఆ సంఖ్య 2025 నాటికి 57.7 శాతానికి పెరిగింది. అందుకు భిన్నంగా అట్టడుగున ఉన్న 50 శాతం మంది తమ జాతీయ ఆదాయం వాటా అదే కాలంలో 22.2 శాతం నుంచి 15 శాతానికి కుంచించుకుపోవడం చూశారు. అయితే, భారత ఆసక్తికరంగా వినియోగం వృద్ధి ఉన్నప్పటికీ అది చైనా కన్నా కనీసం 13 సంవత్సరాలు వెనుకబడి ఉన్నట్లు నివేదిక సూచిస్తోంది. 2023లో భారత తలసరి వినియోగం 1493 డాలర్లుగా ఉంది. అది 2010లోని చైనా తలసరి వినియోగం 1597 డాలర్ల కన్నా బాగా తక్కువ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News