Thursday, January 23, 2025

ఒక కుండలో 90 నాగు పాములు…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఒకటి రెండు లేదా  మూడు, నాలుగు వరకు ఒక దగ్గర పాములు కనిపిస్తేనే ఒళ్లు జల్లుమంటుంది…కానీ ఒక ఇంట్లో ఓ కుండలో 90 నాగు పాములు కనిపించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ నగర్ జిల్లా అలపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…మధువానా గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉన్న పాత కుండలను తీసి బయట పడేస్తున్నాడు. ఓ కుండ మూత తెరిచి చూడగా పాములు కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ పాములను చూడటానికి గ్రామస్థులు తండోపతండాలుగా తరలివచ్చారు. అటవీ శాఖ అధికారులు అక్కడి చేరుకొని 90 పాములను స్వాధీనం చేసుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాముల వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News