- Advertisement -
బెంగళూరు: కర్నాటకలోని ఒక్క బెళగావి జిల్లాలో కరోనాతో 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యువాతపడ్డారు. కర్నాటకలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. బెళగావి జిల్లాలో మొదటి దశలో 23 మంది, రెండో దశలో 20 మంది, చిక్కోడి పరిధిలోని మొదటి దశలో 18 మంది, రెండో దశలో 29 మంది చనిపోయారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంకాగానే లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. విధులు నిర్వహించిన పంతుళ్లలో 10 మందిని కరోనా బలితీసుకుంది. గత 24 గంటల్లో కర్నాటలో 38,603 కరోనా కేసులు నమోదుకాగా 476 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 22.42 లక్షలకు చేరుకోగా 22,313 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం 6.03 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు.
- Advertisement -