- Advertisement -
హాస్లాంగ్ (అసోం) : అసోంలోని హసావో జిల్లా హాష్లాంగ్ నియోజక వర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రంలో 90 ఓట్లు ఉండగా 171 ఓట్లు పోలుకావడం కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాలో 90 మంది పేర్లు ఉండగా, ఈవిఎంలో మాత్రం 171 ఓట్లు పోలయ్యాయి. ఏప్రిల్ 1 న ఈ పోలింగ్ జరిగింది. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన ఐదుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఏప్రిల్ 2న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కాగా, ఈ విషయం సోమవారం బయటపడింది. ఈపోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అసోం శాసన సభ ఎన్నికల్లో అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయి. మొన్న బిజెపి అభ్యర్థి కారులో ఈవిఎంను తరలిస్తుండడం రాజకీయ వివాదానికి దారి తీసింంది.
- Advertisement -