Wednesday, January 22, 2025

తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం: మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ‘మా’ నిర్ణయం తీసుకుందని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ ఆసోషియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను జులైలో మలేషియాలో నిర్వహిస్తామని, పెద్దలతో చర్చించి వేడకల తేదీని నిర్ణయిస్తామన్నారు. జులైలో షూటింగ్‌లకు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరామని, సెలవుపై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని మంచు విష్ణు పేర్కొన్నారు. దేశంలోని ఐదు అసోషియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఘనకీర్తిని చాటిచెప్పేందుకు వేడుకలు నిర్వహిస్తున్నామని, చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గర్వించాల్సిన విషయమని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News