Wednesday, March 12, 2025

ఒక్క ఏడాదిలో 900 మందికి మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

ఒక్క ఏడాది కాలం లోనే (2024) 901 మందికి ఇరాన్ మరణశిక్ష విధించింది. డిసెంబరులో ఒక్క వారంలో 40 మందికి ఈ శిక్ష విధించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మృతుల్లో 31 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పింది. ఈ కఠిన శిక్షకు గురయ్యేవారి సంఖ్య పెరుగుతుండటం కలవరపరుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏటికేటికీ ఈ సంఖ్యలో మరోసారి పెరుగుదల కనిపిస్తోందని తెలియజేసింది. హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా , అత్యాచారం, లైంగిక దాడి వంటి నేరాలకు ఇరాన్‌లో మరణ దండన విధిస్తుంటారు. చైనా మినహా ఒక ఏడాది కాలంలో ఈ తరహా శిక్ష ఎక్కువగా అమలు చేసే దేశం ఇరానే.

మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లోనే గత ఏడాది ఈ శిక్ష ఎక్కువగా అమలైనప్పటికీ, 2022 నిరసనలతో సంబంధం ఉన్నవారిని కూడా ఉరితీసినట్టు ఐరాస పేర్కొంది. 2022 లో ఇరాన్‌లో హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో మాసా అమిని అనే యువతిని పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. అక్కడే ఆమె అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనలకు దారి తీసింది. ప్రజల్లో భయం కలిగించడానికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను ఆయుధంగా వాడుతోందని పలువురు హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మరణశిక్షను రద్దు చేయాలని ఐరాస కూడా ఇరాన్‌ను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News