Monday, December 23, 2024

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు 91.32 శాతం హాజరు

- Advertisement -
- Advertisement -

91.32 percent attendance for SI preliminary exam

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎస్‌ఐ ప్రాథమిక పరీక్షకు హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేకున్నారు. ఆదివారం జరిగిన ఎస్‌ఐ ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరైనట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్(టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) తెలిపింది. మొత్తం 2,25,759 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్ష కీ ని త్వరలో www.tslprb.in వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి వెల్లడించింది. ప్రాథమిక రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు.

మార్కుల కుదింపు: ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించే మార్కులను తొలిసారిగా కుదించారు. గత పరీక్షల్లో సామాజిక వర్గాల వారీగా మార్కులుండేవి. ఈసారి సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో అబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలున్నాయి. వీటిలో 30 శాతం మార్కులు సాధిస్తే పరీక్ష గట్టెక్కినట్లే… అంటే 60 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించగలిగితే అర్హత సాధించినట్లే. మరోవైపు ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులుండటం కీలకంగా మారింది. ఐదు తప్పుడు సమాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించనున్నారు. పరీక్షలో 60 సరైన జవాబులను పక్కాగా గర్తించగలికే చాలు. తుది రాత పరీక్షలో మాత్రం నెగటివ్ మార్కులుండవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News