- Advertisement -
మొజాంబిక్: సముద్రంలో పడవ మునిగి 91 మంది మృతి చెందిన సంఘటన ఆఫ్రికా దేశంలోని మొజాంబిక్ ప్రాంతంలో జరిగింది. నింపులా ప్రొవిన్స్ ఐలాండ్‌కు సమీపంలో 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ సముద్రం మధ్యలోకి వెళ్లిన తరువాత తిరగబడడంతో 91 మంది దుర్మరణం చెందారు. పరిమితి మించి ప్రయాణికులు ఎక్కడంతోనే పడవ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండడంతో సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బంది కలుగుతోంది. మృతులలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. గత ఆరు నెలల నుంచి సౌత్ ఆఫ్రికాలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులలో ప్రతి 15000 మందిలో 32 మంది మృత్యువాత పడుతున్నారు.
- Advertisement -