న్యూఢిల్లీ: తాజాగా మరో 9,119 కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 3,45,44,882కు చేరుకుంది. కాగా గడచిన 539 రోజుల్లో అత్యల్పంగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,940కు క్షీణించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో నమోదైన వివరాల ప్రకారం మరో 396 మరణాలు సంభవించడంతో దేశంలో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,66,980కి చేరుకుంది. గడచిన 48 రోజులుగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20వేల లోపున నమోదు అవుతుండగా గత 151 రోజులుగా 50 వేల లోపల కొత్త కేసులు నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మార్చి నుంచి అత్యల్పంగా మొత్తం నమోదైన కేసులలో యాక్టివ్ కేసులు కేవలం 0.32 శాతం మాత్రమే ఉన్నాయి. కాగా..గత ఏడాది మార్చి నుంచి అత్యధికంగా జాతీయ కొవిడ్ రికవరీ రేటు 98.33 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 1,541 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
అత్యల్పంగా కరోనా యాక్టివ్ కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -