Friday, November 15, 2024

9,125 మారుతీ కార్లు రీకాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ దాదాపు 9,125 వాహనాలను రీకాల్ (వెనక్కి పిలుచు) చేసింది. 2022 నవంబర్ 2 నుంచి 28 మధ్య తయారు చేసిన సియాజ్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, గ్రాండ్ విటారా కార్లను కంపెనీ రీకాల్ చేసింది. ఈ మోడళ్లలో ముందు వరుస సీట్ బెల్ట్ భుజం ఎత్తు అడ్జస్టర్ పార్ట్‌లలో లోపం ఉన్నట్లు కంపెనీ అనుమానిస్తోంది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. బాధిత వాహన యజమానులను కంపెనీ వర్క్‌షాప్‌లు సంప్రదించాల్సి ఉంటుంది. లోపాలు ఉన్న భాగాన్ని ఉచితంగా రిపేర్ చేస్తారు. గతంలో మారుతీ సుజుకి తన మూడు మోడల్స్ వ్యాగన్‌ఆర్, సెలెరియో, ఇగ్నిస్‌లలో 9,925 యూనిట్లను రీకాల్ చేసింది. వెనుక బ్రేక్ అసెంబ్లీ పిన్‌లో లోపం కారణంగా ఈ మోడల్‌లను రీకాల్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News