Wednesday, January 22, 2025

దేశవ్యాప్తంగా కరోనా అదుపులో ఉన్నా… ఢిల్లీలో ఆందోళనకరం

- Advertisement -
- Advertisement -

917 new covid cases reported in delhi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. 24 గంటల వ్యవధిలో 3.64 లక్షల మందికి నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, 9062 కొత్త కేసులు వెలుగు చూశాయి. ముందు రోజు కంటే కొద్ది మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 2.49శాతంగా నమోదైంది. మంగళవారం 15,220 మంది కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు దిగొస్తున్నాయి. ప్రస్తుతం 1.05 లక్షలకు అవి తగ్గాయి. క్రియాశీల రేటు 0.24 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.57 శాతానికి పెరిగిందని బుధవారం కేంద్రం వెల్లడించింది. ఇలా దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కట్టడి లోనే ఉండగా, రాజధాని నగరం ఢిల్లీలో పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ పాజిటివిటీ రేటు 20 శాతానికి చేరువ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం 917 మందికి కరోనా సోకింది. ముందు రోజు 14.57 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు… 19.2 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అక్కడ 5387 మంది హోం ఐసొలేషన్‌లో ఉండగా, 563 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 90 శాతం మంది బూస్టర్ డోసు తీసుకోలేదని డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. గత ఏడాది ప్రారంభం నుంచి దేశం మొత్తం మీద 208 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మంగళవారం 25.9 లక్షల మంది టీకా తీసుకున్నారు. 12.58 కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News