Friday, April 4, 2025

పిఇసెట్‌లో 92.78 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

92.78 percent pass in PECET

ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ ఆర్.లింబాద్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్ పిఇసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి శనివారం ఫలితాలను విడుదల చేశారు. పిఇసెట్‌కు మొత్తం 2,360 మంది హాజరు కాగా,2,264 మంది (92.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 1,441 మంది పురుషులు, 823 మంది మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీహెచ్ గోపాల్ రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్,పిఇసెట్ కన్వీనర్ వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News