- Advertisement -
న్యూఢిల్లీ: మనదేశంలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఈ వేరియంట్ బయటపడినట్టు వెల్లడించింది. ఒమిక్రాన్ కలవరపాటు వేళ దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. ఇందులో 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,976 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,70,115 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 391 మంది కరోనాకు బలవగా, 8612 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు కేసులు కూడా నమోదవడంతో ప్రభుత్వాుల మళ్లీ అప్రమత్తమతున్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి.
- Advertisement -