Thursday, January 23, 2025

నగరంలో భారీగా ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 94మంది ఇన్స్‌స్పెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇటీవల కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు మధురానగర్, బోరబండ, ఫిల్మ్‌నగర్, గుడిమల్కాపూర్, ఖైరతాబాద్, వారసిగూడ, దోమలగూడ, ఐఎస్ సదన్, సెక్రటేరియట్, బండ్లగూడ, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలను నియమించారు. లంగర్‌హౌస్ ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేసి, ఆయన స్థానంలో మహిళా ఇన్స్‌స్పెక్టర్ మాధవిలతను ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.

సుధీర్ఘకాలంలో ఎస్‌హెచ్‌ఓలుగు కొనసాగుతున్న వారిని బదిలీ చేశారు. సిసిఎస్, టాస్క్‌ఫోర్స్, కొత్తగా ఏర్పడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఇన్స్‌స్పెక్టర్లను నియమించారు. దోమలగూడ ఇన్స్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డిని, ఖైరతాబాద్‌కు నిరంజన్‌రెడ్డి పేరువాల, సెక్రటేరియట్‌కు బాలగోపాల్, వారసిగూడకు పి. శంకర్, బండ్లగూడకు ధరావత్ దాస్రు, ఐఎస్ సదన్‌కు మల్లేష్, గుడిమల్కాపూర్‌కు రవి మోలుగూరి, మాసబ్‌ట్యాంక్‌కు మధుసూదన్ బాడే, ఫిల్మ్‌నగర్‌కు శ్రీనివాసు గుండమాల, మధురానగర్‌కు బి. శ్రీనివాస్, బోరబండకు రవికుమార్ కమ్మళ్లను ఇన్స్‌స్పెక్టర్లుగా నియమించారు. బదిలీ అయిన వారు వారి స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News