- Advertisement -
న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత శుక్రవారం ప్రారంభం కాగా..గత నాలుగు రోజులలో అగ్నిపథ్ నియామక పథకం కింద 94,281 దరఖాస్తులు భారత వైమానిక దళానికి(ఐఎఎఫ్) అందాయి. సోమవారం ఉదయం 10.30 వరకు వాయు దళంలో అగ్నివీరుల నియామకాల కోసం 94,281 దరఖాస్తులు అందినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎ భరత్ భూషణ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆదివారం వరకు 56,960 దరఖాస్తులు అందాయి. జూన్ 14న అగ్నివీర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా అనేక రాష్ట్రాలలో హింసాత్మక నిరసనలు వారం రోజుల పాటు కొనసాగాయి. ఈ పథకాన్ని ఉపసంహరించాలని పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండు చేస్తున్నాయి. ఈ పథకం కింద పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న యువజనులు నాలుగేళ్ల ఉద్యోగ కాల పరిమితితో అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. వీరిలో 25 శాతం మంది సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తారు.
- Advertisement -