Wednesday, March 5, 2025

మధ్య తరగతికి పన్నుల కోత ఆలోచన ప్రధాని మోడీదే:నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ‘ప్రజల ద్వారా, ప్రజల కోసం’గా అభివర్ణించారు. మధ్య తరగతి ప్రజల కోసం పన్నుల తగ్గింపు ఆలోచన వెనుక ఉన్నది ప్రధాని నరేంద్ర మోడీయేనని, అయితే, అధికారులకు నచ్చజెప్పడానికి సమయం పట్టిందని మంత్రి తెలియజేశారు. ‘మేము మధ్య తరగతివారి వాణి విన్నాం’ అని, తాము నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులం అయినప్పటికీ తమ ఆకాంక్షలు నెరవేరడం లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారని నిర్మలా సీతారామన్ ఒక ఇంటర్వూలో ‘పిటిఐ’తో చెప్పారు. ద్రవ్యోల్బణం వంటి అంశాల ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని నిజాయతీపరులైన, గర్వకారకులైన పన్ను చెల్లింపుదారులు కోరుతుండడంతో ప్రధాని వెంటనే కల్పించుకుని, వారికి ఉపశమనం కలిగించే మార్గాలు చూసే బాధ్యతను సీతారామన్‌కు అప్పగించారు. పన్ను రాయితీకి మోడీ శీఘ్రంగా అంగీకరించినా, ఆర్థిక మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)లోని సంక్షేమ. ఇతర పథకాల కోసం రెవెన్యూ వసూలు బాధ్యత గల అధికారులను ఇందుకు ఒప్పించడానికి సమయం పట్టిందని సీతారామన్ తెలియజేశారు.

మంత్రి సీతారామన్ వరుసగా తన ఎనిమిదవ బడ్జెట్‌ను శనివారం సమర్పిస్తూ, వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని రూ. 7 లక్షల నుంచి పెంచుతున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు రూ. 12 లక్షల వరకు ఎటువంటి పన్నూ ఉండదు. పన్ను బ్రాకెట్లలో కూడా ఆమె మార్పులు చేశారు. దాని వల్ల అధిక వేతన జీవులు రూ. 1.1 లక్షల వరకు ఆదా చేయగలుగుతారు. మినహాయింపు పరిమితిలో రూ. 5 లక్షల హెచ్చింపు ఇది వరకు ఎన్నడూ లేనంత అధికం. 2005చ 2023 మధ్య ఇచ్చిన వెసులుబాట్లు అన్నిటికీ అది సమానం, ‘ప్రధాని దానిని క్లుప్తంగా పేర్కొన్నారు, అది ప్రజల బడ్జెట్, అది ప్రజలు కోరుకున్న బడ్జెట్ అని ఆయన అన్నారు’ అని సీతారామన్ తెలిపారు. తన సొంత మాటల్లో బడ్జెట్ లక్షణాన్ని వివరించవలసిందని కోరినప్పుడు, ‘అబ్రహాం లింకన్ మాటల్లో ప్రజాస్వామ్యంలో వారంటున్నట్లుగా అది ప్రజల ద్వారా, ప్రజల కోసం, ప్రజల యొక్క బడ్జెట్’ అని నిర్మల పేర్కొన్నారు. కొత్త రేట్లు ‘మధ్య తరగతివారి పన్నులను గణనీయంగా తగ్గించి, వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంచుతాయి, గృహ వినియోగాన్ని, పొదుపు మొత్తాలను, పెట్టుబడిని పెంచుతాయి’ అని సీతారామన్ వెల్లడించారు. ఈ భారీ ప్రకటన వెనుక ఆలోచనను సీతారామన్ వివరిస్తూ, పన్ను కోతల అంశంపై కొంత కాలంగా కృషి సాగుతోందని చెప్పారు.

ప్రత్యక్ష పన్నును సరళతరం, సులభతరం చేయడం ఒక ఆలోచన అని, దీనికి సంబంధించిన యత్నాలు నిరుడు జూలై బడ్జెట్‌లో మొదలయ్యాయని, ఇప్పుడు కొత్త చట్టం రాబోతున్నందని, అది భాషను సరళీకరించి, పన్ను భారాన్ని తగ్గించి, మరింత వినియోగదారు హితంగా చేస్తుందని ఆమె వివరించారు. ‘ఇది రేట్ల పునర్వవస్థీకరించడం గురించి కాదు, అయితే, రేట్లను మరింత సహేతుంగా పన్ను చెల్లింపుదారు హితంగా చేయదగు మార్గాల గురించి మేము చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాం. ఆ పని కూడా సాగుతోంది’ అని ఆమె తెలిపారు. ‘జూలై బడ్జెట్ తరువాత తాము పన్ను చెల్లిస్తున్నామని, కానీ తమ సమస్యలు పరిహారమయ్యే మార్గం తమకు అంతగా కనిపించడం లేదని మధ్య తరగతి ప్రజలు అంటున్నారు. నిరుపేదలు, బడుగు వర్గాల గురించి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ వహిస్తున్నదనే అభిప్రాయం కూడా ఉన్నది. ‘నేను ఎక్కడికి ప్రయాణించినా, మేము చిత్తశుద్ధిగల పన్ను చెల్లింపుదారులం, మేము నిజాయతీగల పన్ను చెల్లింపుదారులం అనేవి వినిపిస్తుండేవి. మంచి పన్ను చెల్లింపుదారులుగా దేశ సేవ కొనసాగించాలని కోరుకుంటున్నాం, మా కోసం మేము చేయగలమని భావిస్తున్నారని అడుగుతున్నారు’ అని ఆమె చెప్పారు.

‘నేను ప్రధానితో ఈ విషయమై చర్చించాను. ఆయన నాకు నిర్దిష్ట బాధ్యత అప్పగించారు’ అని ఆమె తెలిపారు. తాము గణాంకాలపై కృషి చేసి ప్రధానికి అందజేశామని, శనివారం 202526 బడ్జెట్‌లో చేసే ప్రతిపాదనలపై ఆయన మార్గదర్శనం చేశారని సీతారామన్ తెలియజేశారు. ప్రధానిని ఇందుకు ఏవిధంగా ఒప్పించగలిగారు అని ప్రశ్నించినప్పుడు ‘కాదు, మంత్రిత్వశాఖకును. బోర్డు (సిబిడిటి)కి నచ్చజెప్పడానికి ఎంత వ్యవధి పట్టిందనేది మీ ప్రశ్న కావాలి’ అని సీతారామన్ అన్నారు. ‘కనుక, అది ప్రధాని గురించి కాదు. తాను ఏదో ఒకటి చేయాలని ప్రధాని ఎంతో స్పష్టంగా కోరుకుంటున్నారు. మంత్రిత్వశాఖ సంతృప్తి చెందేలా చూసి ప్రతిపాదనతో సాగాలి’ అని ఆమె అన్నారు. ‘దానితో మరింత కృషి జరగవలసి ఉన్నది. పన్నుల వసూలులో సామర్థం గురంచి బోర్డుకు నచ్చజెప్పవలసిన అవసరం ఉంది, నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారుల వాణి వినవలసిన అవసరం ఉంది’ అని ఆమె వివరించారు. మంత్రిత్వశాఖను. సిబిడిటిని ఒప్పించవలసిన అగత్యం ఉందని, ఎందుకంటే రెవెన్యూ వసూలు గురించి వారికి నమ్మకం ఉండాలని ఆమె పేర్కొన్నారు. ‘దాని అర్థం ఏమిటని వారు క్రమం తప్పకుండా నాకు గుర్తు చేస్తుండడంలో తప్పులేదు.

కాని తుదకు ప్రతి ఒక్కరూ అంగీకరించారు’ అని ఆమె తెలిపారు. ప్రధాని వివిధ రంగాల వ్యక్తులు, పారిశ్రామిక అధిపతులతో భేటీ అయ్యి, వారి అభిప్రాయాలు వింటుంటారని, వారి అవసరాలకు స్పందిస్తుంటారని ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. ‘ఈ ప్రభుత్వంలో భాగం అయినందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది అక్షరాలా ప్రజల వాణి వింటూ, స్పందిస్తుంటుంది’ అని సీతారామన్ చెప్పారు. పన్ను పరిధి విస్తరణకు ఎప్పుడూ ప్రయత్నం జరుగుతుంటుందని, పన్ను చెల్లించే స్థితిలోకి మరింత మంది భారతీయులను తీసుకురావడానికి కృషి జరుగుతోందని సీతారామన్ తెలియజేశారు. దేశంలో ఐటి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నవారు ప్రస్తుతం దాదాపు 8.65 కోట్ల మంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News