- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజిపె దూసుకుపోతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే బిజెపి మ్యాజిక్ ఫిగర్ 36 దాటి 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాగా, మాజీ సిఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సిఎం అతిషీ కూడా వెనుకంజలో ఉన్నారు. వీరిద్దరిపై బిజెపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని స్థానాల్లో మూడోస్థానానికే పరిమితమవుతోంది.
- Advertisement -