Saturday, November 16, 2024

ఇసెట్‌లో 95.16% ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

95.16% pass rate in TS ECET 2021 results

ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ టి.పాపిరెడ్డి
ఈసారి ఇడబ్లూఎస్ కోటా అమలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్‌ఇసెట్) 2021లో ఫలితాల్లో 95,16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇసెట్ ఫలితాల్లో అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇసెట్‌లో విద్యార్థినులు 95.93 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 94.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. జెఎన్‌టియుహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నర్సింహారెడ్డి, ఇసెట్ కన్వీనర్ సిహెచ్ వెంకటరమణారెడ్డిలతో కలిసిన కలిసి బుధవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి ఇసెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఈసెట్ పరీక్షకు మొత్తం 23,667 మంది రాయగా, 22,522 మంది అర్హత సాధించారని పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇడబ్లూఎస్ కోటా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కన్వీనర్ కోటాలో 10 శాతం అదనపు సీట్లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాలని అన్నారు. సిరిసిల్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం ప్రవేశాలు కేటాయించడంతో పాటు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే సుల్తాన్‌పూర్‌లో బి.ఫార్మసీ కోర్సు ప్రారంభమవుతుందని తెలిపారు.

24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

ఇసెట్‌సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా తమ ప్రాథమిక వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ మధ్యలో సరిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అలాగే ఈనెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్సు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ మధ్యలో సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టు చేసి, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 13 నుంచి తుది విడత ఇసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాల కోసం https://tsecet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News