Monday, December 23, 2024

దేశంలో 95.3 కోట్లకు పైగా ఓటర్లు : సిఇసి

- Advertisement -
- Advertisement -

95.3 crores voters in India

న్యూఢిల్లీ : దేశంలో 95.3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలెక్షన్ కమిషనర్) సుశీల్ చంద్ర అన్నారు. నేషనల్ ఓటర్స్‌డే కార్యక్రమం సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడారు. మొత్తం ఓటర్లలో 49 కోట్ల మంది పురుషులు, 46 కోట్ల మంది మహిళలు, ఉన్నారని, మరో 1.92 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు (60 ఏండ్లు పైబడినవారు) ఉన్నారని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి భారతీయులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తూ వస్తున్నారని సీఈసీ పేర్కొన్నారు. కేవలం 18 శాతం అక్షరాస్యత ఉంది. కొత్తగా స్వాతంత్య్రం సాధించుకున్న దేశం వేగవంతంగా అభివృద్ది సాధించడానికి ఈ రైట్ టు ఓట్ ఎంతో తోడ్పడిందని ఆయన చెప్పారు. ఇక ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని, ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

కొత్త ఓటర్లకు ఇసి శుభవార్త

న్యూఢిల్లీ : 2021 లో ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. ఈ ఏడాది కొత్తగా జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఎలెక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఇపిఐసి) లను పోస్టు ద్వారా పంపాలని నిర్ణయించినట్టు భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే జనవరి 25 న కొత్త సేవలను ప్రారంభించనున్నట్టు అధికారి తెలిపారు. మేము ఓటరు కార్డులను నేరుగా గ్రహీతలకు పోస్ట్ ద్వారా పంపిణీ చేయడం ప్రారంభిస్తాము. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సేవలను అధికారికంగా ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుతోపాటు ఒక ప్యాకెట్ కూడా పంపుతున్నట్టు అధికారి తెలిపారు. ఈ ప్యాకెట్‌లో ఈవీఎం, ఓటింగ్ విధానంతో సహా మొత్తం సమాచారం ఉంటుందని చెప్పారు. అలాగే ఎన్నికల సంఘానికి చెందిన పోర్టల్ ద్వారా కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News