లక్నో: ‘95 శాతం మంది ప్రజలకు పెట్రోల్, డీజిల్ అవసరంలేదు’ అన్న ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి ఉపేంద్ర తివారీపై సమాజ్‌వాదీపార్టీ అఖిలేశ్ యాదవ్ శుక్రవారం విరుచుకుపడ్డారు.దానికి ప్రతిస్పందిస్తూ ‘అసలు 95 శాతం మంది బిజెపిని కోరుకోవడంలేదు’ అని రిటార్డు ఇచ్చారు. ఉపేంద్ర తివారీ గురువారం ‘తలసరి ఆదాయాన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఏమంత పెరగలేదు, 95 శాతం మందికి అవి అవసరం కూడా లేదు’ అన్నారు. ఈ విషయాన్ని ఆయన పెరుగుతున్న పెట్రోల్ ధరపై విలేకరులు ప్రశ్నించినప్పుడు తెలిపారు. జలౌన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ అహేతుకమైన వ్యాఖ్య చేశారు. “ఒకవేళ మీరు తలసరి ఆదాయానికి తీసుకున్నట్లయితే పెట్రోల్ ధరలు అంతగా పెరుగలేదు. 2014 కంటే ముందటి డేటా తీసుకున్నట్లయితే, మోడీ, ఆదిత్యనాథ్ ప్రభుత్వాలు వచ్చాక తలసరి ఆదాయం రెట్టింపు అయింది” అని ఆయన చెప్పుకొచ్చారు.
“ఉత్తర్‌ప్రదేశ్ బిజెపి మంత్రి ‘సాధారణ ప్రజలను ఖరీదైన పెట్రోల్ ధరలు బాధించవని, ఎందుకంటే వారికి వాటి అవసరం ఉండదు అన్నారు. ఇప్పుడు ఇక ఆ మంత్రి కూడా నడవాల్సిన పరిస్థితి రావొచ్చు, ఎందుకంటే 95 శాతం ప్రజలు బిజెపిని కోరుకోవడంలేదు కనుక” అని అఖిలేశ్ యాదవ్ హిందీలో ట్వీట్ చేశారు.
#WATCH | Jalaun: UP Min Upendra Tiwari says, "…Only a handful of people use 4-wheelers & need petrol. 95% of people don't need petrol. Over 100 cr vaccine doses were administered free of cost to people…If you compare (fuel price) to per capita income, prices are very low now" pic.twitter.com/rNbVeiI7Qw
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 21, 2021