- Advertisement -
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9520 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 41 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.43కోట్లకు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 5,27,597 మంది మరణించారు. గత 24 గంటల్లో 13,084 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 4.37కోట్లకు పైగా మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 87 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 211.39కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీచేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
- Advertisement -