కంచ గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను వెంటనే ఆపేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారి చేసిన నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన అన్నారు. కోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామని తెలిపారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం గెలుస్తుందని చెప్పారు. ఈ భూముల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దని పోలీసులను ఆదేశించినట్లు భట్టి వివరించారు.
కాగా, హెచ్ సియుకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకుని చదును చేసుకుందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆ భూముల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారి చేస్తూ.. సిఎస్ ను ప్రతివాదిగా చేర్చింది. తమ ప్రశ్నలకు సిఎస్ సమాధానం చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది.