Thursday, November 14, 2024

ఎడ్‌సెట్‌లో 96.84 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

96.84 percent pass in TS Edcet

ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ ఆర్.లింబాద్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- 2022(టిఎస్ ఎడ్‌సెట్) ఫలితాలలో 96.84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు. ఇందులో 30,580 మంది(96.84 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, అందులో 25,546 మంది అమ్మాయిలే ఉన్నారు. రాష్ట్ర న్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి శుక్రవారం ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్, ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ, కో కన్వీనర్ పి.శంకర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్,ప్రవేశాల కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ, ఎడ్‌సెట్‌లో 30,580 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, అందులో 25,246 మంది అమ్మాయిలు, 5,334 మంది అబ్బాయిలు ఉన్నాయని అన్నారు.

టాపర్లు వీరే

ఎడ్‌సెట్ ఫలితాలలో 109.03 మార్కులతో సఫిల్‌గూడకు చెందిన అభిషేక మహంతి మొదటి ర్యాంకు సాధించగా, 707.86 మార్కులతో రాజేంద్రనగర్‌కు చెందిన ఎం.ఆంజనేయులు రెండవ ర్యాంకు సాధించారు. 707.50 మార్కులతో ముఖేష్ మూడవ ర్యాంకు, 707.19 మార్కులతో బల్ల మహేష్‌కుమార్ నాలుగవ ర్యాంకు,107.14 మార్కులతో అర్షద్ అహ్మద్ ఐదవ ర్యాంకు పొందారు. అలాగే పాపాని విశ్వక్ ఆరవ ర్యాంకు, జెడ్ సుష్మిత ఏడవ ర్యాంకు,బి.రవితేజ యాదవ్ ఎనిమిద ర్యాంకు, నెర్లకంటి వెంకటేష్ సాగర్ తొమ్మిదవ ర్యాంకు, వడ్డెపల్లి చంద్రమౌలి 10వ ర్యాంకు సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News