Wednesday, November 6, 2024

పిఇసెట్‌లో 96.99 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

96.99 per cent pass in TS PECET

ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ ఆర్.లింబాద్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఎడ్, డిపిఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పిఇసెట్‌లో 96.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బిపిఇడికి మొత్తం 5,054 మంది దరఖాస్తు చేసుకోగా, 3,087 మంది ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరయ్యారు. అందులో 2,994 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి సోమవారం పిఇసెట్ ఫలితాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, పిఇసెట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ర్యాంకర్లు వీరే

పిఇసెట్‌లో బిపిఇడిలో ఖమ్మం జిల్లాకు చెందిన అంగోతు కృష్ణవేణి మొదటి ర్యాంకు సాధించగా, నిర్మల్‌కు చెందిన బడే రమేష్ రెండవ ర్యాంకు,అనంతపూర్‌కు చెందిన దాసరి హర్షవర్ధన్ మూడవ ర్యాంకు సాధించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన గుగులోతు రమాదేవి నాలుగవ ర్యాంకు, కంగల సింధు ఐదవ ర్యాంకు పొందారు. అలాగే డిపిఇడిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజుల సృజన్ మొదటి ర్యాంకు సాధించగా, సిద్దిపేటకు చెందిన తుంగ అనూష రెండవ ర్యాంకు, నిజామాబాద్‌కు చెందిన బొంత అఖిల్ మూడవ ర్యాంకు, భదాద్రి కొత్తగూడెంకు చెందిన వూకె సంధ్య నాలుగవ ర్యాంకు, జోగులాంబ గద్వాలకు చెందిన ఎస్.అజయ్‌కుమార్ ఐదవ ర్యాంకు సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News