- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు ఓటుహక్కు పొందిన అర్హులైన ఓటర్ల సంఖ్య 96 కోట్లు. వీరిలో 47 కోట్ల మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. శనివారం గణాంకాల వివరాలను వెలుగులోకి తెచ్చింది. ఇటీవలే ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ క్రమంలో ఓటర్ల గణాంకాలను వెల్లడించారు. ఓటు వేసేందుకు అర్హులలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 సంవత్సరాల లోపు వారే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 96 కోట్ల మంది ఓటర్ల భారతం కీలక పరిణామం అయింది. ఎన్నికల నిర్వహణకు దాదాపు కోటిన్నర మంది వరకూ పోలింగ్ సిబ్బంది అవసరం ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాల్సి వస్తుంది.
- Advertisement -