Friday, March 14, 2025

96 జిల్లాల్లో జల కాలుష్యం

- Advertisement -
- Advertisement -

దేశంలోని ఏడు రాష్ట్రాలకు చెందిన 96 జిల్లాలు, 11,348 జనావాసాల్లో నీటి కాలుష్యం తీవ్రంగా ఉంటోందని, ఐరన్, నైట్రేట్,భార లోహాలు వంటి కాలుష్యకారకాల నివారణకు కనీసం స్వల్పకాల నివారణ చర్యలైనా చేపట్టడం లేదని పార్లమెంటరీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు పార్లమెంట్‌కు మంగళవారం నివేదిక సమర్పించింది. ఈ దుర్బల ప్రాంతాల్లో సురక్షిత మంచినీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని నీటివనరుల స్థాయి సంఘం అభ్యర్థించింది. ఈ నివేదికలో మరిన్ని వివరాలు వెలుగు లోకి వచ్చాయి.

యురేనియం విషపూరిత అవశేషాలు పంజాబ్‌కు తీరని సమస్యగా పట్టి పీడిస్తోందని, ఆ రాష్ట్రం లోని 9 జిల్లాల్లో 32 నివాస ప్రాంతాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయని వీటిలో 22 ప్రాంతాల్లో తాత్కాలిక నివారణ చర్యలు తీసుకున్నా, మిగతా 10 ప్రాంతాల్లో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టలేదని నివేదిక వివరించింది. ఏడు రాష్ట్రాల 96 జిల్లాల్లో 11,348 నివాసాల్లో ఐరన్, నైట్రేట్, భారలోహాలు తదితర కాలుష్యాలతో నీళ్లు ఉంటున్నా కనీసం స్వల్పకాలిక నివారణ చర్యలైనా తీసుకోలేదని నివేదిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News