Wednesday, January 22, 2025

రూ.2,000 నోట్లు 97.38% వెనక్కి వచ్చాయ్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ రద్దు చేసిన రూ.2,000 నోట్లు దాదాపు 97.38 శాతం బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయి. కేవలం రూ.9,330 కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే ఇంకా చలామణిలో ఉన్నాయని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) వెల్లడించింది. 2023 మే 19న ఆర్‌బిఐ ఈ రూ.2 వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది.

ఈ ప్రకటన చేసిన సమయంలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువచేసే రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. దీనిలో 2023 డిసెంబర్ 29 నాటికి రూ.9,330 కోట్లు మాత్రమే వెనక్కి రావాల్సి ఉంది. మొత్తం 97.38 శాతం నోట్లు వెనక్కి వచ్చాయి. దేశవ్యాప్తంగా 19 ఆర్‌బిఐ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రజలు దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల నుండి ఇండియా పోస్ట్ ద్వారా కూడా రూ.2 వేల నోట్లను పంపొచ్చని ఆర్‌బిఐ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News