Sunday, January 19, 2025

వాపసొచ్చిన 97.62 శాతం రూ.2000 నోట్లు

- Advertisement -
- Advertisement -

భోపాల్: చెలామణి నుంచి ఉపసంహరించిన రూ.2,000 నోట్లలో 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వాపసు వచ్చాయని, సుమారు రూ.8,470 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయని భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బిఐ) శుక్రవారం తెలిపింది. రూ.2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ఆర్‌బిబి ప్రకటించింది. 2023 మే 19 నాటికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 2024 ఫిబ్రవరి 29 నాటికి కేవలం రూ. 8,470 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే ప్రజల వద్ద మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 మే 19న రూ.2,000 నోట్ల చెలామణి ఉపసంహరణ ప్రకటన వెలువడిన నాటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97.62 శాతం వాపసు వచ్చాయని ఆర్‌బిఐ వివరించింది.

రూ.2,000 నోట్లను ప్రజలు ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థకు డిపాజిట్ చేయవచ్చని ఆర్‌బిఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆర్‌బిఐ కార్యాలయాలలో ప్రజలుతమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చేసుకోచ్చని ఆర్‌బిఐ తెలిపింది. దేశంలోని తమ బ్యాంకు ఖాతాలలో క్రెడిట్ చేయడానికి ఏ పోస్టాఫీసు నుంచైనా ఇండియా పోస్టు ద్వారా ఆర్‌బిఐకి రూ. 2,000 నోట్ల ను ప్రజలు పంపవచ్చని కూడా ఆర్‌బిఐ తెలిపింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2.000 నోట్లను తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవాలని మొదట్లో ఆర్‌బిఐ కోరింది. ఇందుకు 2023 సెప్పెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అయితే డిపాజిట్ గడువును 2023 అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. ఆ రోజు తర్వాత నుంచి బ్యాంకు శాఖలలో ఈ మార్పిడి లేదా డిపాజిట్ సేవలను ఆర్‌బిఐ నిలిపివేసింది.

2023 అక్టోబర్ 8 నుంచి ఆర్‌బిఐకి చెందిన 19 కార్యాలయాలలో ఈ సేవలను ఆర్‌బిఐ ప్రారంభించింది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కత, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ సేవలను ఆర్‌బిఐ కార్యాలయాలు కొనసాగిస్తున్నాయి. 2016 నవబర్ 8న రూ.1.000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేసిన అనంతరం రూ.2,000 కరెన్సీ నోట్లను ఆర్‌బిఐ ప్రవేశపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News