- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 97 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో వ్యాక్సినేషన్‌పై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా డిహెచ్ మాట్లాడారు. 83 లక్షల మందికి మొదటి డోస్ పంపిణీ చేశామని, ఒకటి రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ కోటి మార్క్‌ను దాటుతుందన్నారు. 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా 30 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. జిహెచ్ఎంసిలో 100 వ్యాక్సిన్ కేంద్రాలు, 24 మొబైల్ వ్యాన్స్ ద్వారా టీకాలు ఇస్తున్నామన్నారు. జిహెచ్ఎంసిలో15 లక్షల మంది రిస్క్ టేకర్స్‌కు టీకాలు ఇచ్చామన్నారు.
- Advertisement -