- Advertisement -
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 97 శాతం మందికి కొవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. రాజ్యసభలో కొవిడ్ వ్యాక్సినేషన్ గురించి చర్చ జరిగిన సమయంలో ఆమె ఈ వివరాలను తెలిపారు. వ్యాక్సినేషన్ స్వచ్ఛంద అంశమని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా టీకాలు వేసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా రెండు డోసుల నూరుశాతం వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తి అవుతుందని టీఎంపీ డాక్టర్ శంతను సేన్ ప్రశ్నించారు. కొవిడ్ మృతులకు నాలుగు లక్షల నష్టపరిహారాన్ని ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ శక్తిసింఘ్ గోహిల్ అడిగారు.
97 percent completion of Corona first dose in India
- Advertisement -