Sunday, December 22, 2024

అమెరికాలోకి అక్రమ ప్రవేశాలు..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు దాదాపు 97000 మంది యత్నించారు. వీరిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు యుఎస్ కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ సంస్థ యుసిబిపి వెల్లడించింది. రికార్డుల మేరకు 96,917 మంది ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య కాలంలో అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించినట్లు నిర్థారణ అయింది. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాకు చేరుకోవాలనే తపనతో అక్రమంగా సరిహద్దులు దాటుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ సంఖ్యను సంవత్సరాల వారిగా సంస్థ తమ గణాంకాల వివరాలతో తెలిపింది. ఎక్కవ మంది ముందుగా విమానాల్లో ఫ్రాన్స్ చేరుకుని తరువాత ఏదో విధంగా మెక్సికోలో ప్రవేశించి అక్కడి నుంచి బస్సులలో రహస్యంగా తాము ఎంచుకున్న ప్రాంతాలకు వెళ్లుతుంటారని వెల్లడైంది. ఈ విధంగా ఇతర దేశాల వారు ఉపాధికోసం , సంపాదన కోసం చేరుతున్నారని, అయితే దీనితో తమ దేశం భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఇటీవలే అమెరికా సెనెటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డు సభలో ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News