- Advertisement -
హైదరాబాద్: సిఎం కెసిఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బుధవారం ఎర్రబెల్లి శాసన సభలో మాట్లాడారు. ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ వయసు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగిందన్నారు. 6 లక్షల 66 వేల మందికే మాత్రమే కేంద్రం పెన్షన్ ఇస్తుందని, మనం 44 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని ప్రకటించారు. మోడీ ప్రభుత్వం ఆరు లక్షల మందికి మాత్రమే రూ.200 చొప్పున ఇస్తుందని, కేవలం ఆసరా పెన్షన్ల కోసమే నెలకు రూ.971 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
- Advertisement -