Sunday, October 6, 2024

ఈ ఏడాది హజ్ యాత్రలో 98 భారతీయులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లింలు స్తోమత ఉంటే జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేస్తారు. అది వారి ధార్మిక విధి. ఇస్లాం ధార్మిక ఐదు మూల స్థంభాలలో ఒకటి హజ్ యాత్ర.  ప్రపంచం నలుమూలల నుంచి హజ్ కోసం ముస్లింలు సౌదీ అరేబియాకు వెళతారు.

ఈ ఏడాది భారత్ నుంచి 175000 మంది హజ్ కు వెళ్లారు. వారిలో దాదాపు 98 మంది చనిపోయారు. వారిలో చాలా మంది అనారోగ్యం, వృద్ధాప్యం తదితర కారణాలతో చనిపోయారని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అరాఫత్ రోజున ఆరుగురు భారతీయులు చనిపోయారు. నలుగురు భారతీయులు రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు. గత ఏడాది హజ్ యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 187.

సౌదీలో ఈసారి హజ్ యాత్రలో తాళలేని ఉష్ణోగ్రత యాత్రికులు చవిచూడాల్సి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News